
ముదిరాజ్‌లను బీసీ–ఏలోకి మార్చాలని వినతి
● బాన్సువాడలో రౌండ్ టేబుల్ సమావేశం
బాన్సువాడ: ముదిరాజ్ కులస్తులను బీసీ–డి నుంచి బీసీ–ఏలోకి మార్చేందుకు కృషి చేయాలని కోరుతూ బుధవారం బాన్సువాడలో వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌లకు వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని పాత బాన్సువాడ ముదిరాజ్ సంఘ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం జిల్లా అ ధ్యక్షుడు బట్టు విఠల్ మాట్లాడారు. తెలంగాణలో అత్యధిక జనాభా గల ముదిరాజ్ కులస్తులు రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, ప్రభు త్వం వెంటనే ముదిరాజ్ కులస్తులకు న్యాయం చే యాలని కోరారు. ఈ నెల 15న కామారెడ్డిలో జరిగే బీసీ డిక్లరేషన్‌లో ముదిరాజ్ కులస్తులను బీసీ–ఏలోకి మార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వా లని అన్నారు. ముదిరాజ్ కులస్తులు గురువినయ్, జిన్న రఘు, లింగమేశ్వర్, కనుకుట్ల రాజు, డాక య్య, భీమ గంగారం, కొంకి విఠల్, రాజేష్, దత్తు, కొంకి విఠల్, మొగులయ్య తదితరులున్నారు.