
బాన్సువాడకు జ్వరమొచ్చింది!
బాన్సువాడ : బాన్సువాడ డివిజన్‌లో జ్వరాలు వి జృంభిస్తున్నాయి. ప్రజలు చాలామంది కీళ్లు, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు. మరోవైపు దగ్గు, జలుబు వేధిస్తున్నా యి. దీంతో ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి రోజూ 800 నుంచి 900 వరకు జ్వర పీడితులు వస్తున్నారు. రోగులతో ప్రైవేట్ ఆస్పత్రులూ కిటకిటలాడుతున్నాయి.
నెల రోజులుగా..
ప్రజలు నెల రోజులుగా వైరల్ జ్వరాలతో బాధ పడుతున్నారు. డివిజన్‌లోని బాన్సువాడ, జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, బీర్కూ ర్, నస్రుల్లాబాద్, పెద్దకొడప్‌గల్‌లతోపాటు పొరుగున ఉన్న కంగ్టి, నారాయణఖేడ్ మండలాలనుంచీ రోగులు బాన్సువాడఆస్పత్రికి వస్తున్నారు. జ్వరం, మలేరియా, డెంగీ, వాంతులు, విరేచనాలు, కాళ్ల వాపులు, కీళ్లు, ఒళ్లు నొప్పులు రోజుల తరబడి తగ్గకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నా రు. నొప్పుల తీవ్రత అధికంగా ఉండడంతో రోజుల తరబడి మంచానికే పరిమితం కావాల్సి వస్తోంది. ఫలితంగా ఏ పని సొంతంగా చేసుకోలేకపోతున్నా మని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బా న్సువాడ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరగడంతో ఒ క్కో మంచంపై ఇద్దరు, ముగ్గురికి చికిత్సలు చేస్తు న్నారు. ప్రైవేట్ ఆస్పత్రులలోనూ రోగుల తాకిడి ఉంది.
వ్యాధులతో బాధపడుతున్న
డివిజన్ ప్రజలు
ఏరియా ఆస్పత్రికి పెరుగుతున్న
రోగుల తాకిడి
రోజూ 800 పైనే ఓపీ..
ప్రైవేటు ఆస్పత్రులలోనూ రద్దీ

బాన్సువాడకు జ్వరమొచ్చింది!