
రెవెన్యూకు మంచి పేరు తీసుకురావాలి
ఈవీఎం గోదాం పరిశీలన
కామారెడ్డి క్రైం: ఉత్తమ సేవలు అందించి రెవెన్యూ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో 363 గ్రామ పాలనాధికారుల పోస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వివిధ క్లస్టర్లకు కేటాయించిన గ్రామ పాలన అధికారులకు కలెక్టర్ నియామక ఉత్తర్వులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసి ప్రస్తుతం ఇతర శాఖల్లో ఉన్నవారిని ప్రభుత్వం ఎంతో నమ్మకంతో మళ్లీ రెవెన్యూ శాఖలోకి తీసుకుందన్నారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా కేటాయించిన క్లస్టర్లలో రెవెన్యూ విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ, భూభారతి చట్టం అమలు, ఇతర రెవెన్యూ విధులను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు.
కామారెడ్డి క్రైం: కలెక్టరేట్ సమీపంలోని ఈవీ ఎం గోదాంను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం సందర్శించారు. రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమక్షంలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లను పరిశీలించారు. సీసీ కెమెరాలు, భద్రత ఏర్పాట్లను పరిశీలించి అధికారులు, భద్రత సిబ్బంది కి పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఆ ర్డీవో వీణ, తహసీల్దార్ జనార్దన్, ఎన్నికల వి భాగం డీటీ అనిల్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.