
‘నగదు రహిత లావాదేవీలు జరపాలి’
దోమకొండలో నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్న డీఆర్‌డీవో సురేందర్
దోమకొండ: నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించడం కోసం జిల్లాలో దోమకొండ మండలాన్ని ఎంపిక చేసినట్లు డీఆర్‌డీవో సురేందర్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఆయన మండలానికి చెందిన గ్రామ సంఘాల సభ్యులు, ఐకేపీ సీసీలు, సీఏలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామసంఘాల అధ్యక్షులు, సిబ్బంది డిజిటల్ లావాదేవీలు జరిగేలా చూడాలని కోరారు. యూపీఐ ద్వారా రోజూ లక్ష రూపాయల వరకు లావాదేవీలు జరుపవచ్చన్నారు. మహిళలకు డిజిటల్ లావాదేవీలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మండల మండల ప్రత్యేకాధికారి జ్యోతి, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఐకేపీ ఏపీడీ విజయలక్ష్మి, డీపీఎం శ్రీనివాస్, కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.