సదాశినగర్(ఎల్లారెడ్డి): ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలకు గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్లు ఓపెన్ స్కూల్ కేంద్రం ఇన్‌చార్జి, కల్వరాల్ జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒకే సంవత్సరం పదో తరగతి పాసైన వారికి ఒకే సంవత్సరం ఇంటర్‌మీడియట్ పూర్తవుతుందని.. రెగ్యులర్ ఇంటర్‌తో సమానమైన అవకాశాలుంటాయన్నారు.
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని సర్వాపూర్, ముదెల్లి గ్రామాల్లో మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి వరి పంటలను పరిశీలించినట్లు ఏవో రాజలింగం తెలిపారు. ఇటీవల కురిసన భారీ వర్షాలకు పలు గ్రామాల్లో పంటలకు నష్టం జరిగిందన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి నష్టం జరిగిన పంటలు, బాధిత రైతుల వివరాలు సేకరిస్తున్నట్లు ఏవో తెలిపారు. ఏఈవో దీక్షిత్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉత్తునూర్ పీహెచ్‌సీ వైద్యాధికారి సాయికుమార్ అన్నారు. మంగళవారం ఆశాడే సందర్భంగా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా వీధులతో పాటు పరిసరాల్లో చెత్తా చెదారం కూరుకుపోయి ఉంటుందన్నారు. ఆశాకార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఏఎన్‌ఎం భాగ్యశ్రీ, హెచ్‌ఈవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో ఇటీవల వరదలకు ధ్వంసమైన హౌసింగ్ బోర్డుకాలనీ వైకుంఠధామానికి వెళ్లే రోడ్డును తక్షణమే బాగు చేయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఎం నాయకులు రోడ్డును పరిశీలించారు. మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేయించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వారం రోజులుగా అంత్యక్రియలకు వచ్చిన పలువురు శ్మశానవాటికకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వివరించారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ స్పందించి రోడ్డు బాగు చేయించాలని డిమాండ్ చేశారు. నాయకులు వెంకట్ గౌడ్, కొత్త నర్సింలు, అరుణ్‌కుమార్ తదితరులున్నారు.
బాన్సువాడ: బాన్సువాడ కోట దుర్గమ్మ ఆలయ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పద్మ నరేష్, గౌరవ అధ్యక్షుడిగా చిదుర శివకుమార్, ఉపాధ్యక్షుడిగా బుడాల సాయిలు, ప్రధాన కార్యదర్శిగా దాసరి బాలకృష్ణ, సహాయ కార్యదర్శిగా రాగిరి శ్రావణ్ కుమార్, కోశాధికారిగా పత్తి మహేందర్, సహాయ కోశాధికారిగా నవీన్‌లను ఎన్నుకున్నారు. మాజీ అధ్యక్షుడు పత్తి శ్రీకాంత్, గంగాధర్, ఉప్పరి లింగం తదితరులున్నారు.
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మంగళవారం ఐకేపీ వీవోఏల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గౌస్ ఖాన్ తెలిపారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విక్రమ్ గుప్తా, జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్‌రావు ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షురాలిగా ప్రభావతి రెడ్డి, ఉపాధ్యక్షురాలిగా లక్ష్మీప్రియ, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీదేవి, సహాయ కార్యదర్శిగా లక్ష్మి, కోశాధికారిగా కవితను ఎన్నుకున్నట్లు తెలిపారు.
దరఖాస్తు గడువు పెంపు
దరఖాస్తు గడువు పెంపు
దరఖాస్తు గడువు పెంపు