ప్రారంభానికి నోచుకోని పీహెచ్‌సీ | - | Sakshi
Sakshi News home page

ప్రారంభానికి నోచుకోని పీహెచ్‌సీ

Sep 10 2025 3:39 AM | Updated on Sep 10 2025 3:39 AM

ప్రార

ప్రారంభానికి నోచుకోని పీహెచ్‌సీ

ప్రారంభానికి నోచుకోని పీహెచ్‌సీ

అందుబాటులోకి తీసుకురావాలి

సమయానికి అందడం లేదు

నస్రుల్లాబాద్‌: మండలాలు ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా చికిత్స కోసం పాత మండలాలు, ఏరియా ఆస్పత్రులకు వెళ్లాల్సి రావడం మాత్రం తప్పడం లేదు. గర్భిణులు, చిన్నారులు ప్రతి నెలా టీకాల కోసం బీర్కూర్‌ వెళ్లి రావాల్సి వస్తుంది. ప్రతి వారం నస్రుల్లాబాద్‌ మండలంలోని 19 గ్రామ పంచాయతీల నుంచి మహిళలు ఇబ్బందులు పడుతూ పోతున్నారు. నూతన పంచాయతీ ఏర్పాటై తర్వాత కూడా పాత మండలాలకు వెళ్లి చికిత్స చేసుకుంటున్నారు.

అలంకారప్రాయంగా..

మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) రూ.1.43 కోట్లతో పూర్తి చేశారు. దీనికి తోడు రూ.12 లక్షలు పెట్టి సీసీ రోడ్లు సైతం పూర్తి చేశారు. కాని అధికారులు సిబ్బంది కేటాయింపులో అలసత్వం ప్రదర్శిస్తుండటంతో అలంకారప్రాయంగా దర్శనం ఇస్తోంది. వివిధ మండలాల నుంచి ఫర్నిచర్‌ను తీసుకువచ్చి పెట్టారు. మంత్రులతో ప్రారంభింపజేయాలని స్థానిక నాయకులు ఎదురుచూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు.

అందుబాటులో లేని వాక్సిన్‌లు

నస్రుల్లాబాద్‌లో కుక్కలు, కోతుల బెడద విపరీతంగా ఉంది. అటవీ ప్రాంతానికి దగ్గరగా మండలం ఉండటంతో పాములు, కుక్కలు, కోతుల కాట్లకు గురవుతున్నారు. అయితే స్థానికంగా వాక్సిన్‌ నిల్వ చేసే ఏర్పాట్లు లేకపోవడంతో బీర్కూర్‌, బాన్సువాడ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. మండల కేంద్రంలోని పీహెచ్‌సీ అందుబాటులోకి వస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.

నిర్మాణం పూర్తయినా సేవలు మొదలు కాని నస్రుల్లాబాద్‌ పీహెచ్‌సీ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించి నిరుపయోగంగా వదిలేశారు. అధికారులు నాయకులు త్వరగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చి ప్రజల అవసరాలు తీర్చాలి.

– నర్సింలు గౌడ్‌, నస్రుల్లాబాద్‌

మండలంలో సరైన వై ద్య సదుపాయం లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. పాము కాటు వాక్సిన్‌ సమయానికి అందక ప్రాణాలు పోతున్నాయి. పీహెచ్‌సీని ఉపయోగంలోకి తీసుకొస్తే ప్రజలకు మేలవుతుంది. – అల్లం రాములు, మైలారం

సిబ్బంది కేటాయింపులో

అధికారుల అలసత్వం

చికిత్స కోసం బీర్కూర్‌,

బాన్సువాడకు వెళ్లాల్సిన పరిస్థితి

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ప్రారంభానికి నోచుకోని పీహెచ్‌సీ1
1/2

ప్రారంభానికి నోచుకోని పీహెచ్‌సీ

ప్రారంభానికి నోచుకోని పీహెచ్‌సీ2
2/2

ప్రారంభానికి నోచుకోని పీహెచ్‌సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement