
విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పగిలిన లింబు
● గంటల తరబడి విద్యుత్ సరఫరాకు
అంతరాయం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నాగిరెడ్డిపేట 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మంగళవారం లింబు పగిలిపోవడంతో సబ్‌స్టేషన్‌న్ పరిధిలోని పలు గ్రామాలకు గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సబ్‌స్టేషన్‌లో 8 మెగావాట్ల ట్రాన్స్‌ఫార్మర్ నుంచి బయటకు వచ్చే ఎల్‌వీ బ్రేకర్‌పై లింబు ఆకస్మికంగా పగిలిపోయింది. కాగా లింబు పగిలిన సమయంలో ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రమాదం జరగలేదు. కాగా నూతన లింబును తీసుకువచ్చి బిగించేవరకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో మండల కేంద్రం గోపాల్‌పేటతోపాటు పలుగ్రామాలకు 5 గంటలకుపైగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పగిలిన లింబు