ప్రపంచ దేశాలకు మన ఆర్థిక వ్యవస్థ ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ దేశాలకు మన ఆర్థిక వ్యవస్థ ఆదర్శం

Sep 9 2025 8:45 AM | Updated on Sep 9 2025 8:45 AM

ప్రపంచ దేశాలకు మన ఆర్థిక వ్యవస్థ ఆదర్శం

ప్రపంచ దేశాలకు మన ఆర్థిక వ్యవస్థ ఆదర్శం

సుభాష్‌నగర్‌: ప్రపంచ దేశాలకు భారత ఆర్థిక వ్యవస్థ ఆదర్శంగా నిలుస్తోందని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు. దేశ ప్రజలకు దీపావళి కానుకగా జీఎస్‌టీలో సంస్కరణలు తీసుకొచ్చినందుకు బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ చిత్రపటాలకు నగరంలోని గాంధీచౌక్‌లో సోమవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ పటేల్‌ కులాచారితోకలిసి అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ మాట్లాడారు. జీఎస్‌టీపై గగ్గోలు పెట్టిన ప్రతిపక్షాలకు ఇది చెంపపెట్టన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు ఉపయోగించే షాంపు నుంచి లగ్జరీ కార్ల వరకు భారీ ఊరట కల్పించారని హర్షం వ్యక్తంచేశారు. తద్వారా దేశంలో దీపావళి పండుగ సంబరాలు ఇప్పుడే మొదలయ్యాయన్నారు. ప్రధానంగా ఆరోగ్య, జీవిత బీమాలతోపాటు 33 రకాల అత్యవసర మందులపై జీరో జీఎస్‌టీ ఒక విప్లవాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగస్వాములవుతూ మన దేశ ఉత్పత్తులు పెంచి, గ్రామీణస్థాయి నుంచి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న మోదీ సంకల్పానికి తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు బంటు రాము, నాయకులు జ్యోతి, వనిత, ఇప్పకాయల కిశోర్‌, తారక్‌ వేణు, హరీశ్‌రెడ్డి, పంచరెడ్డి శ్రీధర్‌, మాస్టర్‌ శంకర్‌, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అర్బన్‌ ఎమ్మెల్యే

ధన్‌పాల్‌ సూర్యనారాయణ

ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి

నిర్మల సీతారామన్‌ చిత్రపటానికి

పాలాభిషేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement