సదాశివనగర్: ప్రజల ప్రాణాలను కాపాడేందుకే వేగ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. సోమవారం మండల కేంద్రం శివారు అయ్యప్ప ఆలయం వద్ద 44వ జాతీయ రహదారిపై స్పీడ్ లేజర్ గన్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు తప్పవన్నారు. జిల్లాలో మూడు స్పీడ్ లేజర్ గన్‌లు వాహనదారుల వేగాన్ని నియంత్రించడానికి ఏర్పాటు చేశామన్నారు. సంవత్సర కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పూర్తిగా తగ్గిందన్నారు. 2024 ఆగస్టు వరకు 188 ప్రమాదాలు చోటు చేసుకోగా, వాటిని 145కి తగ్గించగలిగామన్నారు. అదే విధంగా మరణాలు 197 నుంచి 153కి తగ్గినట్లు తెలిపారు. గాయపడ్డ వారి సంఖ్య 181 నుంచి 173కి తగ్గినట్లు పేర్కొన్నారు. అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించి జరిమానాలు విధించి క్రమంగా వారి వేగ నియంత్రణ చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. లేజర్ గన్స్‌ను జిల్లాలో పరిధిలో 44వ, 161వ జాతీయ రహదారులపై ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో రోడ్డు భద్రతా చర్యల విజయాన్ని సూచిస్తూ ప్రజల ప్రాణాల రక్షణలో గొప్ప ముందడుగుగా నిలిచామన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై పుష్పరాజ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ప్రాణాలను కాపాడేందుకే
స్పీడ్ లేజర్ గన్‌లు
ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల
సంఖ్య తగ్గింది
నిబంధనలు ఉల్లంఘిస్తే
చలానాలు తప్పవు
ఎస్పీ రాజేశ్ చంద్ర