
అక్షరాస్యతను పెంచాలి
మాచారెడ్డి: ప్రతి ఒక్కరూ సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేసి అక్షరాస్యత శాతాన్ని పెంచాలని ఎంఈవో దేవేందర్‌రావు అన్నారు. సోమవారం మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్‌లో వయోజన విద్య నవభారత్ సాక్షరతలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులు సీఆర్‌పీ దేవ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండిమాసానిపేటలో సోమవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరు చదువుకోవాల ని వారు ఫ్లకార్డులతో ప్రదర్శన చేశారు. ఎంఈవో రాజులు, ఉపాధ్యాయులు తదితరులున్నారు.
విద్య ప్రతి ఒక్కరికి అవసరం
బీబీపేట: ప్రస్తుత రోజుల్లో విద్య ప్రతి ఒక్కరికి అవసరమని బీబీపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామేశ్వర్‌రెడ్డి అన్నా రు. సోమవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్స వం పురస్కరించుకొని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. గ్రామ కార్యదర్శి రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అక్షరాస్యతను పెంచాలి

అక్షరాస్యతను పెంచాలి