
‘స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్’పై శిక్షణ
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): విద్యార్థులు, ఉపాధ్యాయు లలో పర్యావరణహిత ఆలోచనలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ ఏవం హరిత విద్యా లయ రేటింగ్(ఎస్‌హెచ్‌వీఆర్)’పై నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్‌పేట హైస్కూల్‌లో సోమవా రం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్ వస్త్రాల రాజశేఖర్ మాట్లాడుతూ.. నూతన విద్యావిధానంలో భాగంగా పాఠశాల స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ పాటించడంతోపాటు హరిత పాఠశాలలు నెలకొల్పేందుకు కేంద్రప్రభుత్వం దేశంలోని అన్ని పాఠశాలల్లో ఎస్‌హెచ్‌వీఆర్‌పై గ్రేడింగ్ ఇవ్వనుందన్నారు. మంచి గ్రేడింగ్ వచ్చిన పాఠశాలలకు రాష్ట్రస్థాయిలో రూ.లక్ష నగదుతోపాటు పాఠశాలలోని ఉపాధ్యాయులకు ఉచి తంగా విహారయాత్ర కల్పించనున్నట్లు చెప్పారు. సర్వేలో భాగంగా పాఠశాల వివరాలు, ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. సర్వేలో పాల్గొ న్న ప్రతి పాఠశాలను సంబంధిత అధికారి సందర్శించి ఆన్‌లైన్లో నమోదు చేసిన వివరాలను తనిఖీ చేస్తారని చెప్పారు. మండలానికి ఉత్తమ పుర స్కారం వచ్చేలా ప్రతి ఒక్క హెచ్‌ఎం కృషి చేయాల ని గోపాల్‌పేట హైస్కూల్‌లో హెచ్‌ఎం వెంకట్రాంరెడ్డి సూచించారు. సీఆర్పీలు రాజయ్య, కృష్ణస్వామి, యంఆర్‌సీ కంప్యూటర్ ఆపరేటర్ శైలేంద్ర తదితరులు పాల్గొన్నారు.