
ఉత్తమ సేవలతోనే గుర్తింపు
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: ఉత్తమ సేవలు అందించినప్పుడే ఉద్యోగికి గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాల్లో భా గంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 41 మందిని సోమవారం కలెక్టరేట్‌లో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరింత ఆదర్శవంతంగా విద్యాబోధన చేసి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, బాన్సువాడ సబ్‌కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్ చందర్‌నాయక్, డీఈవో రాజు, ఆర్డీవో వీణ, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.