
రేపు తుది ఓటరు జాబితా
కామారెడ్డి క్రైం : రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సాధారణ ఎన్నికలకు సంబంధించి ఈనెల 10న తుది ఓటరు జాబితాను ప్రదర్శించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిషత్ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈనెల 6న జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాలు, గ్రామపంచాయతీలలో ముసాయిదా ఓటరు, ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాలను ప్రదర్శించామన్నారు. దీనిపై సోమవారం వరకు అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించామని తెలిపారు. వచ్చిన అభ్యంతరాలను మంగళవారం పరిశీలించి, పరిష్కరిస్తామని, బుధవారం తుది ఓటరు, తుది పోలింగ్ కేంద్రాల జాబితాలను ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.