
రహదారికి తాత్కాలిక మరమ్మతులు
నిజాంసాగర్(జుక్కల్): ఎల్లారెడ్డి– బాన్సువాడ ప్రధాన రహదారికి ఆదివారం తాత్కాలిక మరమ్మతు పనులు ప్రారంభించారు. ‘మరమ్మతులకు నోచుకొని రహదారి’ అని ఆదివారం ప్రచురితమైన కథనానికి ఆర్‌ఆండ్‌బీ అధికారులు స్పందించారు. తుంకిపల్లితండా వద్ద రహదారి మధ్యలో గుంతను పూడ్చి వేసి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. అలాగే బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద వరద ప్రవాహానికి కోతకు గురైన రహదారికి మట్టి, మొరం వేసి తాత్కాలికంగా మరమ్మతులు చేపడుతున్నారు. ఈమరమ్మతులు పూర్తయితే బస్సు సర్వీసులను పునరుద్ధరించున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ–లింబుర్ ప్రధాన రహదారిపై గల ముళ్లపొదలను ఆర్‌అండ్‌బీ అధికారులు ఆదివారం జేసీబీతో తొలగించారు. ఈ నెల 2న ‘రోడ్డును కమ్మేసినా కనపడటం లేదా?’ అని ప్రచురితమైన వార్తకు ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించారు. డోంగ్లీ మండల కేంద్రం నుంచి లింబుర్ రహదారిపై ముళ్లపోదలు బాగా పెరిగిపోయి రోడ్డును కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అధికారులు రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదలను తొలగించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పొల్కంపేట గ్రామంలో ఆదివారం రామకృష్ణ మఠం గ్రామశ్రీ సేవా వారి ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి అనూహ్య స్పందన లభించినట్లు మండల వైద్యాధికారి రాంబాయి తెలిపారు. ముందుగా ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి ఆరోగ్య పరీక్షలు చేసుకొని శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామానికి చెందిన 252 మందికి పరీక్షలు చేసి మందులు అందజేసినట్లు తెలిపారు. పలువురికి రక్త నమూనాలు సేకరించినట్లు తెలిపారు.సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరేష్, తహసీల్దార్ సురేష్, ఎంపీవో మలహరి, కార్యదర్శి అశ్వక్, వైద్య సిబ్బంది గణేష్, రజినీ, ఆశావర్కర్లు తదితరులున్నారు.

రహదారికి తాత్కాలిక మరమ్మతులు

రహదారికి తాత్కాలిక మరమ్మతులు

రహదారికి తాత్కాలిక మరమ్మతులు