మంత్రి సీతక్కకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

మంత్రి సీతక్కకు సన్మానం

Sep 7 2025 7:52 AM | Updated on Sep 7 2025 7:56 AM

గుర్తుతెలియని వ్యక్తి హత్య

కామారెడ్డి టౌన్‌: పంచాయతీరాజ్‌, శిశుసంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి అనసూయ(సీతక్క)ను జిల్లా కాంగ్రెస్‌, లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులు శనివారం ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌ నుంచి సీతక్క నాగ్‌పూర్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో టేక్రియాల్‌ బైపాస్‌ వద్ద మంత్రికి స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణా ప్రతాప్‌ రాథోడ్‌, జిల్లా అధ్యక్షులు గణేష్‌ నాయక్‌, జిల్లా క్రమశిక్షణ కమిటీ కన్వీనర్‌ నౌసిలాల్‌ నాయక్‌, నాయకులు శంకర్‌ నాయక్‌, విజయ్‌ నాయక్‌, రవిందర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

పెద్దఎడ్గి లడ్డూ

@ రూ.1.51 లక్షలు

నిజాంసాగర్‌(జుక్కల్‌)/సదాశివనగర్‌: జుక్కల్‌ మండలం పెద్దఎడ్గి గ్రామంలో ముదిరాజ్‌ గణేశ్‌ మండపం వద్ద వినాయక లడ్డూవేలం పాట శనివారం నిర్వహించారు. రూ.1.51 లక్షలకు లడ్డూను గ్రామానికి చెందిన సుంకరి అశోక్‌ దక్కించుకున్నారు. అశోక్‌ ను సన్మానించారు. సదాశివనగర్‌ మండలం కుప్రియాల్‌లో శివాజీ యువసేన యూత్‌ క్లబ్‌ గణేశ్‌ లడ్డూను వేలం పాట నిర్వహించగా రూ. 63వేలు పలికిట్లు యూత్‌ సభ్యులు పేర్కొన్నారు.

నేడు సంపూర్ణ

చంద్రగ్రహణం

ఆలయాల మూసివేత

కామారెడ్డి అర్బన్‌/నస్రుల్లాబాద్‌/భిక్కనూర్‌: చంద్రగ్రహణం కారణంగా ఆదివారం ఉద యం నుంచి ఆలయాలను మూసివేయనున్న ట్లు కమిటీల ప్రతినిధులు తెలిపారు. సంప్రోక్ష ణ, దేవతామూర్తులకు అభిషేకం అనంతరం సోమవారం ఉదయం నుంచి భక్తులకు దర్శ నం ఉంటుందని తెలిపారు. నస్రుల్లాబాద్‌ మండలం నెమ్లి గ్రామంలోని షిర్డీ సాయి ఆలయా న్ని మధ్యాహ్నం 12.30 గంటలకు మూసివేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దక్షిణ కాశీగా పేరొందిన భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకు మూసి వేయనున్నట్లు అర్చకుడు రామగిరిశర్మ తెలిపారు. సోమవారం తెల్లవారుజామున సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. గ్రహణం నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు భోజనాలు పూర్తి చేసుకోవాలని శర్మ సూచించారు.

ఖలీల్‌వాడి: నగరంలోని రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న ఓ కిరాణా దుకాణం ముందర ఒక గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు వన్‌ టౌన్‌ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. సదరు కిరాణ దుకాణం వద్ద మృతదేహం పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే ఘటన స్థలానికి చేరుకు న్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, అతడి వయస్సు సుమారు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటాయని పోలీసులు పేర్కొన్నా రు. గుర్తుతెలియని వ్యక్తులు మృతుడి మెడకు బట్ట, సుతిలితో ఉరి బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపినట్టు కనపడుతోందన్నారు. మృతుడు బ్లాక్‌ కలర్‌ ఫుల్‌ షర్ట్‌, గ్రే కలర్‌ ప్యాంటు ధరించి ఉన్నాడని, అతని వద్ద ముస్లింలు ధరించే టోపీ ఉందన్నారు. ఘటనపై భగవాన్‌కాలనీకి చెందిన వెనిశెట్టి శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి సమాచారం తెలిస్తే వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఫోన్‌ నంబర్‌ 87126 59714కు సమాచారం అందించాలన్నారు.

మంత్రి సీతక్కకు సన్మానం 1
1/1

మంత్రి సీతక్కకు సన్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement