
గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు
●బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి
బాన్సువాడ : బాన్సువాడలో శనివారం రాత్రి ప్రారంభమయ్యే గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో పోలీసు సిబ్బందికి విధులు కేటాయించారు. నిమజ్జనం సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు బాన్సువాడ డివిజన్‌లో గత ఏడాది 1025 వినాయక మండపాలు ఉంటే ఈ ఏడాది 1382 మండపాలను ఏర్పాటు చేశారని అన్నారు. బాన్సు వాడలో పాత బాన్సువాడ, కొత్త బాన్సువాడలో ఒకే రోజు శోభాయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో తన పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, 60 సిబ్బందికి విధులు కేటాయించామని అన్నారు. వినాయక నిమజ్జనం ప్రశాంత వాతవారణంలో కొనసాగేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ, బిచ్కుంద సీఐలు అశోక్, అనిల్‌కుమార్‌లు ఉన్నారు.
గణేశ్ నిమజ్జన శోభాయాత్ర రూట్ల పరిశీలన
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర రూట్లను శనివారం అధికారులు పరిశీలించారు. పట్టణంలోని డెయిలీమార్కెట్, గాంధీచౌక్, పెద్దమసీదు ప్రాంతాలలో గణేశ్ నిమజ్జన రూట్లను ఎస్సై మహేష్, విద్యుత్ శాఖ డీఈ విజయసారథిలు పరిశీలించారు. వినాయక విగ్రహాలకు విద్యుత్ తీగలు అడ్డుగా ఉన్న ప్రదేశాలలో నూతనంగా విద్యుత్ స్తంభాలను విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు

గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు

గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు

గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు