
గ్రామాల్లో వైద్య శిబిరాలు
భిక్కనూరు/సదాశివనగర్/బాన్సువాడ రూరల్/రాజంపేట : జిల్లాలోని పలు చోట్ల వైద్యశిబిరాలు నిర్వహించారు. భిక్కనూరు మండలకేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో భిక్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను శనివారం నిర్వహించారు. వైద్యురాలు యెమిమా, ఎంపీహెచ్‌ఈవో వెంకటరమణ పరీక్షలు నిర్వహించారు. సదాశివనగర్ మోడల్ స్కూల్ వసతి గృహంలో నిర్వహించిన వైద్యశిబిరంలో వైద్యాధికారిణి ఆస్మా అప్షిన్ సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు.బాన్సువాడ మండలం బోర్లంక్యాంపులో గల తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఇమ్రాన్ వైద్య సిబ్బందితో కలిసి విద్యార్థులను పరీక్షించారు. చాలామంది విద్యార్థులు జ్వరాల బారిన పడటంతో రక్తపరీక్షలు చేశారు. హన్మాజీపేట్ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో విద్యార్థులకు కావాల్సిన మందులు అందజేశారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆహ్వానం మేరకు రాజంపేట మండలం నడిమి తండా, ఎల్లాపూర్ తండాల్లో రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యశిబిరంలో 293 మంది వైద్యపరీక్షలు చేశారు. వైద్య శిబిరాల్లో వారికి కావాల్సిన మందులు అందజేశారు.రామకృష్ణ మఠం వైద్యులు శుష్మిత్, కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు తేజస్విని, రామకృష్ణ మఠం సభ్యులు ఉన్నారు.

గ్రామాల్లో వైద్య శిబిరాలు

గ్రామాల్లో వైద్య శిబిరాలు

గ్రామాల్లో వైద్య శిబిరాలు