
ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ
● నలుగురికి తీవ్ర గాయాలు
కామారెడ్డి క్రైం: గణేష్ శోభాయాత్ర కోసం తీసుకువెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని లారీ ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డికి సమీపంలోని క్యాసంపల్లి వద్ద ప్రధా న రోడ్డుపై శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. రామారెడ్డి నుంచి ట్రాక్టర్ ట్రాలీని కొంద రు యువకులు కలిసి దోమకొండకు తీసుకువెళ్తున్నారు. ఈ సమయంలో నలుగురు యువకులు ట్రాక్టర్ ఇంజిన్‌పై కూర్చుని ప్రయాణిస్తున్నారు. క్యాసంపల్లి వద్ద వారి ట్రాక్టర్‌ను ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దోమకొండ కు చెందిన సాయికుమార్, శ్రీధర్, రాజయ్య, శివకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసు లు వారిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. గా యపడిన వారిలో శ్రీధర్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు.