కామారెడ్డిలో బీసీ సంబరాలు | - | Sakshi
Sakshi News home page

కామారెడ్డిలో బీసీ సంబరాలు

Sep 7 2025 7:50 AM | Updated on Sep 7 2025 7:50 AM

కామార

కామారెడ్డిలో బీసీ సంబరాలు

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : బీసీ డిక్లరేషన్‌ ప్రకటించి న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలోనే బీసీ రిజర్వేషన్‌ సంబరాలు నిర్వహించా లని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15న బీసీలతో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ ఇంట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క చర్చించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కామారెడ్డిలో ఆదివారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. 15న నిర్వహించతలపెట్టిన సభపై చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2023 నవంబర్‌ 10న కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడి యం వేదికగా బీసీ డిక్లరేషన్‌ సభ నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి నామినేషన్‌ వే సిన అనంతరం ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పా టు చేసిన సభకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ని ర్వహించిన సభలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరా మయ్యతోపాటు రేవంత్‌రెడ్డి, ప్రొఫెసర్‌ కోదండ రాం, సీపీఐ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లతోపాటు పలు హామీలతో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో బీసీ రిజర్వేషన్లను అమ లు చేయడానికి ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లు అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్‌ పేర్కొంటోంది. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ఈ నెల 15న కామారెడ్డిలో బహిరంగ సభ ద్వారా సంబరా లు జరుపుకునేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.

రిజర్వేషన్ల అంశంతో బీసీలకు దగ్గరయ్యేలా..

బీసీ డిక్లరేషన్‌లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణించిన విషయాన్ని అనుకూలంగా మల్చుకుని బీసీ వర్గాల్లో బలాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. బీసీ రిజర్వషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ వేదికగా కూడా భారీ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. బీసీలను దగ్గర చేసుకునే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని మరింతగా ఆ వర్గాల్లోకి తీసుకువెళ్లేందుకు బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. సభకు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌ లేదా ప్రియాంక గాంధీని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నాయకత్వమంతా సభకు హాజరుకానున్నారు.

నేడు కామారెడ్డిలో సన్నాహక సమావేశం

బీసీ రిజర్వేషన్ల సంబరాల సభకు సంబంధించి ఉమ్మడి జిల్లా నేతలతో ఆదివారం కామారెడ్డిలో సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలంతా హాజరుకానున్నారు. సభ సక్సెస్‌ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చించనున్నారు. సభ ఏర్పాట్లు, జనసమీకరణపై చర్చించి ఎవరు ఏ పని చేయాలన్నదానిపై దిశానిర్దేశం చేస్తారు.

కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదిక నుంచి బీసీ డిక్లరేషన్‌ ప్రకటించిన కాంగ్రెస్‌.. ఇప్పుడు అదే వేదికపైనుంచి బీసీ సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది. 42 శాతం బీసీ రిజర్వేషన్‌ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన నేపథ్యంలో విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. ఈనెల 15వ తేదీన బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఈ నెల 15న కాంగ్రెస్‌ సభ !

బీసీ డిక్లరేషన్‌ ప్రకటించిన వేదికపైనే..

జాతీయస్థాయి నాయకులు

హాజరయ్యే అవకాశం

నేడు ఉమ్మడి జిల్లా నేతలతో

సన్నాహక సమావేశం

కామారెడ్డిలో బీసీ సంబరాలు1
1/1

కామారెడ్డిలో బీసీ సంబరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement