
కేసీఆర్ అవినీతి బయటపడుతుంది
నిజాంసాగర్(జుక్కల్): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అవినీతి సీబీఐ విచారణతో బయటపడుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే మండల కేంద్రంలో శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం ఏటీఎంలా వాడుకుందని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి బయటపడుతుందనే విచారణ వద్దంటూ బీఆర్‌ఎస్ నాయకులు ధర్నాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పెద్ద పీట వేస్తోందన్నారు.
కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్‌కుమార్, ఉమ్మడి మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు ఎలే మల్లికార్జున్, రవీందర్‌రెడ్డి, నాయకులు ప్రజాపండరి, ఇఫ్తేకర్ దొర, సాయిలు, బాల్‌సాయిలు తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట వాసికి
‘గణపతి’ అవార్డు
లింగంపేట(ఎల్లారెడ్డి): పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వారికి జ్ఞాన వికాస భారతి క్రీడా సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అందించే గణపతి అవార్డు లింగంపేట మండల కేంద్రానికి చెందిన యువ యూత్ అధ్యక్షుడు బొల్లు శ్రీకాంత్‌కు దక్కింది. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ రాక్‌టవర్ కాలనీలో శనివారం అవార్డును అందజేయగా శ్రీకాంత్ అందుకున్నారు. శ్రీకాంత్ గత 15 సంవత్సరాలుగా ప్రతి ఏటా మట్టి గణపతులు తయారు చేసి ఇంటింటికి వెళ్లి వితరణ చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసే రంగురంగుల గణపతులు వాడడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిళ్లుతుందని గ్రామాల్లో అవగాహన కల్పి స్తున్న శ్రీకాంత్‌కు అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డును రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. సంస్థ బాధ్యులు గోవర్ధన్‌చారి, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ అవినీతి బయటపడుతుంది