ఉత్తమ సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ సేవలు అందించాలి

Sep 6 2025 5:33 AM | Updated on Sep 6 2025 5:33 AM

ఉత్తమ సేవలు అందించాలి

ఉత్తమ సేవలు అందించాలి

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

కామారెడ్డి క్రైం: జిల్లాలోని ఆయా గ్రామాలకు ఎంపికై న గ్రామ పాలనాధికారులు శనివారం హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను పొందనున్నారు. అందుకు గాను గ్రామపాలనాధికారులను హైదరాబాద్‌ తీసుకువెళ్లేందుకు రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7 ప్రత్యేక బస్సులను కలెక్టరేట్‌ వద్ద కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఇదివరకు కామారెడ్డి రెవెన్యూ శాఖలో వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా పనిచేసి ప్రస్తుతం ఇతర శాఖల్లో విధులు నిర్వహిస్తున్న వారికి ఇటీవల ప్రభుత్వం ఎంపిక పరీక్ష నిర్వహించింది. ఎంపికై న 365 మంది నియామక ఉత్తర్వులు పొందనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వివిధ శాఖలలో పనిచేస్తూ తిరిగి రెవెన్యూ శాఖలోకి వస్తున్న వారిని అభినందించారు. ఉత్తమ సేవలు అందించి గుర్తింపు పొందాలని సూచించారు. ఈ బస్సులలో ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థ సింహారెడ్డి, కలెక్టరేట్‌ ఏవో మసూద్‌ అహ్మద్‌, సిబ్బంది తరలి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement