
గ్యాస్ ట్యాంకర్‌ను ఢీకొన్న బస్సు
భిక్కనూరు: జంగంపల్లి శివారులో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, గ్యాస్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. వివరాలు.. నిజామాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం సికింద్రాబాద్ నుంచి నిజామా బాద్ వైపు వస్తోంది. జంగంపల్లి శివారులోకి రాగానే ముందున్న గ్యాస్ ట్యాంకర్‌ను వేగంగా వచ్చి ఢీకొట్టి అనంతరం అదుపుతప్పి రోడ్డు అవతలి వైపునకు దూసుకెళ్లింది.ఈ ఘటనలో బస్సు ముందర భాగం, ప్రవేశ ద్వారం తీవ్రంగా దెబ్బతి న్నాయి. దీంతో ప్రయాణికులు అత్యవసర ద్వారం గుండా బయటకు వచ్చారు. ఈ ప్రమాదంలో గ్యాస్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకేజీ కాకపోవడంతోపాటు పేలకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ట్యాంకర్ పేలి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని స్థానికులు పేర్కొన్నారు.