
అవార్డులు అందుకున్న ఉత్తమ గురువులు
రాజంపేట/కామారెడ్డి అర్బన్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో శుక్రవారం రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్లుగా ఎంపికై న వారికి అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితారాణా, ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి చేతుల మీదుగా పలువురు అవార్డులను అందుకున్నారు. రాజంపేట మండలం పొందూర్తి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ముదాం స్వామి రాష్ట్ర ఉత్తమ టీచర్‌గా ఎంపిక కావడంతో ఆయనకు అవార్డును అందజేశారు. అలాగే కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాల అసోసియేట్ డీన్ సురేష్ రాథోడ్ సైతం రాష్ట్ర ఉత్తమ టీచర్‌గా ఎంపిక కావడంతో అవార్డును అందుకున్నారు.