వాడి గ్రామస్తుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

వాడి గ్రామస్తుల ధర్నా

Sep 6 2025 4:37 AM | Updated on Sep 6 2025 4:37 AM

వాడి

వాడి గ్రామస్తుల ధర్నా

ధర్పల్లి: ముత్యాల చెరువుతో మా గ్రామానికి ముంపు ఉన్నదని, ఆ చెరువు వద్ద మళ్లీ మరమ్మతులు చేపట్టి చెరువు కట్టను నిర్మించవద్దని వాడి గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. తెగిపోయిన ముత్యాల చెరువు వద్ద ఇరిగేషన్‌ అధికారులు చెరువు కట్ట తెగిపోవడానికి గల కారణాలను పరిశీలించడానికి అధికారులు శుక్రవారం వచ్చారు. విషయం తెలుసుకున్న వాడి గ్రామస్తులు ఇరిగేషన్‌ అధికారులతో మాట్లాడడానికి ట్రాక్టర్లపై ముత్యాల చెరువు వద్దకు వెళ్లారు. ధర్పల్లి ఎస్సై కళ్యాణి సిబ్బందితో కలిసి గ్రామస్తులను అడ్డుకొని వారిని నివారించారు. దీంతో వాడి రోడ్డు పై కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహించిన గ్రామస్తులు రెండు గంటలపాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చెరువు తెగి భారీ వరద గ్రామంలోకి రావడంతో ఇళ్లు, పంట భూములు కోల్పోయి ప్రాణాలతో బయటపడ్డామని గ్రామస్తులు వాపోయారు.

విద్యుత్‌ షాక్‌తో

బాలుడికి గాయాలు

వర్ని: మండలంలోని పాత వర్ని గ్రామంలో ఓ బాలుడికి విద్యుత్‌ షాక్‌ తగిలి తీవ్ర గాయాలు అయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. పాత వర్ని గ్రామానికి చెందిన గడ్డం నరేష్‌ (7) శుక్రవారం గ్రామంలోని వీరభద్ర ఆలయం నుంచి ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభానికి సపోర్టుగా ఉన్న తీగను పట్టుకోవడంతో అతడికి కరెంట్‌ షాక్‌ తగిలింది. వెంటనే స్థానికులు గమనించి కర్రతో బాలుడిని కొట్టడంతో కింద పడిపోయాడు. అనంతరం బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్తంభానికి మినీ ట్రాన్స్‌ఫార్మర్‌ ఉండడంతోనే సపోర్ట్‌ వైర్‌కు విద్యుత్‌ సరఫరా అయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్‌శాఖ అధికారులు వెంటనే స్పందించి స్తంభానికి ఉన్న మినీ ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

వాడి గ్రామస్తుల ధర్నా 
1
1/4

వాడి గ్రామస్తుల ధర్నా

వాడి గ్రామస్తుల ధర్నా 
2
2/4

వాడి గ్రామస్తుల ధర్నా

వాడి గ్రామస్తుల ధర్నా 
3
3/4

వాడి గ్రామస్తుల ధర్నా

వాడి గ్రామస్తుల ధర్నా 
4
4/4

వాడి గ్రామస్తుల ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement