
కళా ఉత్సవ్‌కి ఎంపికై న విద్యార్థులు
బీబీపేట: కళా ఉత్సవ్– 2025లో భాగంగా గు రువారం జిల్లా స్థాయిలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక పోటీలలో మండల కేంద్రంలోని టీఎస్‌ఎన్‌ఆర్ బాలుర పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికై న అఖిల్, పూర్ణచందన, ఇందు, దయానంద్, శివమణి, హర్షన్,తేజ,అఖిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి లో ఆడుతారని ప్రధానోపాధ్యాయుడు రవీంద్రారెడ్డి తెలిపారు.ఉపాధ్యాయులు విశ్వ మోహన్,నాగరాజు,రాధిక తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి: రేషన్ డీలర్లను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు సురేందర్ అన్నారు. గురువారం జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా రేషన్ డీలర్లను ముందస్తుగా అరెస్టు చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. రేషన్ డీలర్ల 5 నెలల కమీషన్‌ను, రూ. 5 వేల గౌరవ వేతనం అందించాలని కోరారు. డీలర్లు చంద్రయ్య, శ్రీనివాస్, ఆగమయ్య, విఠల్ తదితరులున్నారు.
ఎల్లారెడ్డిరూరల్: భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డులను పొందాలని జిల్లా సీఎస్‌సీ హెల్త్ సెంటర్ మేనేజర్ ప్రవీణ్ నాయక్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డిలో భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డు ఆవశ్యకత గురించి వివరించారు. లేబర్ కార్డు వల్ల ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.10 లక్షల బీమా వర్తిస్తుందన్నారు. నాయకులు రజాక్ తదితరులున్నారు.
తాడ్వాయి: సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎర్రాపహాడ్ శివారులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మోతె రోడ్డులో వాహనాలను పోలీసులు నిలిపివేశారు. సీఎం రేవంత్‌రెడ్డి హెలీకాప్టర్ నుంచి దిగి రోడ్డు మార్గంలో లింగంపేట్ మండలానికి వెళ్లే వరకు వాహనాలను నిలిపివేశారు. అనంతరం లింగంపేట్ మండలం నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రానికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లే వరకు తాడ్వాయి, ఎర్రాపహాడ్, కృష్ణాజీవాడిలోని కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలోనూ వాహనాలను నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పీజీ, బీఎడ్, ఎంఎడ్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా కొనసాగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఇంటిగ్రేటెడ్ పీజీ 8, 10వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల్లో 45 మంది విద్యార్థులకు గానూ 44 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. బీఎడ్, 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల్లో 46 మంది విద్యార్థులకు గానూ 33 మంది హాజరు కాగా 13 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అలాగే ఎంఎడ్ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1,2 3, 4వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షల్లో 33 మంది విద్యార్థులకు గానూ 31 మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.

కళా ఉత్సవ్‌కి ఎంపికై న విద్యార్థులు

కళా ఉత్సవ్‌కి ఎంపికై న విద్యార్థులు

కళా ఉత్సవ్‌కి ఎంపికై న విద్యార్థులు