
సీఎం పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్ట్‌లు
తాడ్వాయి: జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో గురువారం రాత్రి బీఆర్‌ఎస్, బీజేపీ, భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు, రేషన్ డీలర్లను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ కపిల్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నర్సింలులను అరెస్టు చేయడంతో బీఆర్‌ఎస్ నాయకులు నిరసన తెలిపారు.
బీకేఎస్ నేతల నిరసన..
భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్‌రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న రైతులు శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చి నిరసన తెలిపారు. భారతీయ కిసాన్ సంఘ్ క్రమశిక్షణ కలిగిన సంఘమని, ఏ నిరసన కార్యక్రమమైనా చట్టబద్ధంగా చేస్తామని పేర్కొన్నారు. బీకేఎస్ జిల్లా అధ్యక్షుడిని అరెస్ట్ పేరుతో వేధించడం రైతులను అవమానించడమేనన్నారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఆయనను విడుదల చేశారు.