
సరిపడా యూరియా ఇవ్వాలి
పెద్దకొడప్‌గల్(జుక్కల్): రైతులకు సరిపడా యూరియాను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని భారతీయ కిసాన్ సంఘం(బీకేఎస్) గ్రామ అధ్యక్షుడు కుమార్ సింగ్ పేర్కొన్నారు.బుధవారం మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో రోడ్డుపై రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతాంగం చాలా ఇబ్బందిలో ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి యూరియాను అందుబాటులో తెచ్చి రైతుల సమస్యను పరిష్కరించాలని కోరారు.అనంతరం నాయబ్ తహసీల్దార్ చంద్రకాంత్‌కు వినతి పత్రం అందజేశారు. సంఘం నేతలు బోడి రాజు యాదవ్, బోడి మల్లికార్జున్, రైతులు పాల్గొన్నారు.