
సీఎం ఈసారైనా దయచూపేనా?
బార్ కౌన్సిల్ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలి
కామారెడ్డి టౌన్: బార్ కౌన్సిల్ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నంద రమేష్, బండారి నరేందర్‌లు డిమాండ్ చేశారు. జేఏసీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ భవనంలో న్యాయవాదుల డిమాండ్లతో కూడిన కరపత్రాలను ఆవిష్కరించారు. న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. పదవీ కాలం ముగిసినా ఆరేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడం దారుణమన్నారు. సుప్రీంకోర్టులో వేసిన కేసుకు జవాబు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ పదవులను పొడిగించుకోవడం సరికాదన్నారు. రెండు నెలలలోపు బార్ కౌన్సిల్ ఎన్నికలను నిర్వహించాలని లేకుంటే న్యాయవాదులు చలో హైదరాబాద్ పిలుపునిచ్చి పోరాటం చేస్తామని తెలిపారు. న్యాయవాదులు శ్యామ్ గోపాల్ రావు, క్యాతం సిద్ధరాములు, జగన్నాథం, దేవరాజ్ గౌడ్, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చింతల గోపి పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జిల్లాలో అనేక సమస్యలు వెక్కిరిస్తున్నాయి. సాగునీటి సమస్య, విద్య, వైద్యరంగాలతో పాటు పారిశ్రామికరంగాల్లోనూ వెనుకబడే ఉంది. కరీంనగర్–కామారెడ్డి–ఎల్లారెడ్డి(కేకేవై) రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలి. జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణకు నిధులు ఇవ్వాలి. ఇంకా ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి. కామారెడ్డి నుంచి రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఈ ప్రాంత ప్రజలు గౌరవ ప్రదమైన ఓట్లు వేశారు. ప్రజల ఆశలకు అనుగుణంగా అభివృద్ధికి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
కామారెడ్డి నియోజక వర్గంతో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాలుగైదు మండలాలకు సాగునీరందించేందుకు రూపొందించిన 22వ ప్యాకేజీ పనులు ఏళ్లుగా ముందుకు కదలడం లేదు. భూసేకరణతో పాటు పనులు చేపట్టేందుకు నిధులు ఇవ్వాల్సి ఉంది.
విద్యారంగానికి సంబంధించి కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు జరగాలి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఇంజినీరింగ్ కాలేజీ, బీఎడ్, డీఎడ్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. కామారెడ్డికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ రావాలి. సౌత్ క్యాంపస్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలి.
వైద్య రంగానికి సంబంధించి స్థానికంగా వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులున్నాయి. అయితే ఆస్పత్రిలో స్కానింగ్ మిషన్ లేక బయట చేయించుకునే పరిస్థితి ఉంది. ఆస్పత్రి, మెడికల్ కాలేజీ భవనాల పనులు త్వరగా పూర్తి చేసి సౌకర్యాలు మెరుగుపర్చాలి. ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బిచ్కుంద, మద్నూర్, పిట్లం, మద్నూర్ ఆస్పత్రుల్లో వైద్యులను నియమించాలి.
జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ జరగకపోవడంతో ట్రాఫిక్ కష్టాలు రెట్టింపయ్యాయి. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు నిర్మించాలి. జంక్షన్ల అభివృద్ధి చేపట్టి ఇబ్బందులు తొలగించాలి. విలీన గ్రామాలకు ప్రత్యేక నిధులివ్వాలి.
కేకేవై రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేయడానికి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ నుంచి కామారెడ్డి, ఎల్లారెడ్డి మీదుగా పిట్లం వరకు ఉన్న ఈ రోడ్డు రవాణా రంగంలో కీలకమైనది. మూడు రాష్ట్రాలను కలిపే రహదారిగా దీన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది.
పారిశ్రామిక ప్రగతిలో వెనుకబడిపోయాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి పంట ఉత్పత్తులకు తగిన ప్రాధాన్యతనివ్వాలి. ఇదే సమయంలో స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకావాలు కల్పించాలి.
జిల్లా కేంద్రాన్ని రెండుగా విభజించే రైల్వే ట్రాక్‌పై వంతెనలు నిర్మించకపోవడంతో నిత్యం ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
కాళేశ్వరం 22వ ప్యాకేజీకి నిధులిస్తేనే సాగునీటి కష్టం తీరేది
ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలి
వెద్య సేవలు మెరుగుపడాలి
కేకేవై రోడ్డును హైవేగా అభివృద్ధి చేయాలి
జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ జరగాలి
సమగ్ర అభివృద్ధికి కృషి అవసరం