
మున్సిపల్ కార్మికుడిని ఆదుకోవాలి
కామారెడ్డి టౌన్: మున్సిపల్ వాటర్‌వర్క్స్ విభాగంలో విధులు నిర్వహించి ఇంటికి వెళూ్‌త్ ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న కార్మికుడు మాసుల లింగంను ఆదుకోవాలని మున్సిపల్ వర్కర్స్ యూని యన్ నాయకుడు నర్సింగ్‌రావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. కుప్రియాల్ వద్ద గు ర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తలకు తీ వ్ర గాయాలై నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిపారు.
పోటాపోటీగా
రక్తదానం చేయాలి
కామారెడ్డి అర్బన్:పోటాపోటీగా వినాయని ఉ త్సవాలు నిర్వహించిన యువకులు అదే స్ఫూ ర్తితో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు,ఆపదలో ఉన్న రోగులకు రక్తదా నం చేయడానికి శిబిరాలు ఏర్పాటు చేయాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సమన్వయకర్త బాలు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రక్తదానం చేయడానికి యువజన సంఘాలు ముందుకు వస్తే అందుకు ఏర్పాట్లు అన్నీ తాము చూసుకుంటామని బాలు పేర్కొన్నారు. వివరాలకు 94928 74006, 88973 49872 నంబర్లకు సంప్రదించవచ్చన్నారు.
నాణ్యమైన భోజనం
అందించాలి
పెద్దకొడప్‌గల్(జుక్కల్): విద్యార్థుఽలకు విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని తహసీల్దార్ అనిల్ కుమార్ సూచించారు. బుధవారం కాటేపల్లి తండాలోని ప్రాథమిక పాఠశాలలో వండుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని సూచించారు. అనంతరం కాటేపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆర్‌ఐ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): గణేశ్ శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని ఎస్సై పుష్పరాజ్ సూచించారు. బుధవారం ఆయన డీజే నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండపాల నిర్వాహకులు డీజే నిర్వాహకులకు ముందస్తుగా డబ్బులు ఇచ్చి ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.