
పోలింగ్ కేంద్రాల పరిశీలన
నస్రుల్లాబాద్: సంగం, సంగం(ఏ), మిర్జాపూర్, నాచుపల్లి గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాలను బుధవారం ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్ పరిశీలించారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, తాగు నీరు, మరుగు దొడ్ల సదుపాయాలను పరిశీలించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ పాల్య్త విఠల్, పంచాయతీ కార్యదర్శి అనిల్ ,గ్రామస్తులు ఉన్నారు.
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని పలు గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను ఎంపీడీవో ప్రకాష్ బుధవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో ఉన్న సమస్యలను ఆయన ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. బీఎల్‌వోలు తదితరులున్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎర్రాపహాడ్‌లో బుధవారం సివిల్ రైట్స్‌డే కార్యక్రమాన్ని నిర్వహించారు. మూఢనమ్మకాలను వీడాలని, అంటరానితనం ఉండవద్దని, అందరు సమానంగా ఉండాలని సూచించారు. ఆర్‌ఐ హారిక, రెవిన్యూ, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాల పరిశీలన