
కవిత సస్పెన్షన్‌పై గులాబీ శ్రేణుల్లో చర్చ
● కొంతకాలంగా ఎమ్మెల్సీకి
దూరంగా జిల్లా నేతలు
● సస్పెన్షన్ సరైనదేనంటున్న
బీఆర్‌ఎస్ నేతలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవితను బీఆర్‌ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ చర్యతో గులాబీ శ్రేణులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. ఎమ్మెల్సీ కవిత కొంతకాలంగా పార్టీని కాదని జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ నేతలు చాలామంది ఆమెకు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం కామారెడ్డిలో నిర్వహించిన బీసీ సదస్సుకు కొందరు నే తలు హాజరైనా.. తర్వాత వారు కూడా ఆమెకు దూరంగా ఉంటున్నారు. ఎల్లారెడ్డి నియోజక వర్గానికి చెందిన సంపత్‌గౌడ్ తెలంగాణ జాగృతి జిల్లా బాధ్యతలు చూస్తున్నారు.
పార్టీతోపాటు పార్టీ నేతలపై ఎమ్మెల్సీ కవి త చేసిన విమర్శల నేపథ్యంలో బీఆర్‌ఎస్ శ్రేణు లు ఆందోళనకు గురయ్యారు. అసలేం జరుగుతోందంటూ చర్చించుకున్నారు. కాళేశ్వరం ప్రా జెక్టులో అవినీతంటూ ప్రభుత్వం సీబీఐ వి చారణ కోరడం, దీనిపై కవిత స్పందించి హరీష్‌రావు, సంతోష్‌రావులను టార్గెట్ చేయడంతో ఆమెను పార్టీ సస్పెండ్ చేసింది. ఈ విషయం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
సరైన నిర్ణయం :
గంప గోవర్ధన్
బీఆర్‌ఎస్ పార్టీ ఏ ఒక్కరి దో కాదని, 60 లక్షల మంది కార్యకర్తల సొంతమని కా మారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేర్కొన్నారు. పార్టీకి న ష్టం కలిగిస్తే ఎంతటి వారిౖపైనెనా చర్య లు ఉంటాయన్నారు. మంగళవారం ఆయన కామారెడ్డిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత కొంతకాలంగా పార్టీకి నష్టం కలిగేలా ప్రకటనలు చేస్తున్నారని, ఇది అందరినీ బాధించిందని పేర్కొన్నారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌కు ప్రజలు, కార్యకర్తలే ముఖ్యమని, పార్టీకి నష్టం కలిగించేవారు ఎంతటివారైనా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారని దీనిద్వారా స్పష్టమైందని పేర్కొన్నారు.
స్వాగతిస్తున్నాం..
ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్ అన్నారు. పార్టీలో పెద్దా, చిన్నా అనేది ఉండదని, తప్పు ఎవరు చేసినా క్రమశిక్షణా చర్యలు ఉంటాయని స్పష్టమైందని పేర్కొన్నారు.