
బాధితులకు భరోసాగా కిరణ్మయి..
యువ ఐఏఎస్ అధికారి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి వరదలు సృష్టించిన విపత్తులో కీలకంగా పనిచేశారు. మంజీరలో చిక్కుకున్న గొర్రెల కాపరులను రక్షించేందుకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బిచ్కుంద మండలంలో మకాం వేసి రెస్క్యూ టీంలకు దిశానిర్దేశం చేశారు. తాను కూడా బోటులో బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించి, ధైర్యం చెప్పారు. వరదల సమయంలో ఆమె రాత్రింబవళ్లు శ్రమించారు. వరదలతో ఇళ్లు మునిగిపోవడంతో నిరాశ్రయులైన పలు గ్రామా ల ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి వారికి ఆశ్రయం క ల్పించడంలో సమర్థవంతమైన సేవలను అందించి ప్రజల మన్ననలు పొందారు.