
ప్రముఖులకు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు
కామారెడ్డి అర్బన్ : ప్రజాపిత బ్రహ్మకుమారీ స్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కామారెడ్డి ఓం శాంతి కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌తో పాటు అడిషనల్ కలెక్టర్లు, అధికారులు, రాజకీయ నాయకుల కు రాఖీలు కట్టి, మిఠాయిలు అందజేసి రక్షబంధన్ ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో ఓం శాంతి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఇన్‌చార్జి బీకే జయ దీదీ, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతల స్వీకరణ
బోధన్‌టౌన్(బోధన్): బోధన్ మున్సిపల్ కమిషనర్‌గా రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బల్దియా కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాపై సిబ్బంది ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. బల్దియాకు వచ్చే ఆదాయంతోపాటు బల్దియాకు రావాల్సిన బకాయిలపై శ్రద్ధచూపాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని వెల్లడించారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి బల్దియా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
గంటల తరబడి తిప్పాల్సిందే..
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి లక్ష్మి కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టలన్నా.. నీటి విడుదల పెంచాలన్నా.. తగ్గించాలన్నా గంటల తరబడి గేట్లను తిప్పాల్సిందే. లేదంటే గేట్లు లేవవు, దిగవు. గేట్లకు కరెంట్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది చేతులతోనే వాటిని ఎత్తుతున్నారు. శుక్రవారం నీటి విడుదల పెంచడం కోసం ఉదయం 7గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు గేట్లను తిప్పితే 200 క్యూసెక్కులకు నీటి విడుదల పెరిగింది. గంటల తరబడి గేట్లను తిప్పడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖులకు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు