
బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయండి
రామారెడ్డి: గంగమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు కాంట్రాక్టరుకు సూచించారు. ఎంతో కాలంగా బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా ఉండడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. వర్షాలు కురిసేలోపు బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. కాంగ్రెస్ నాయకులు లక్ష్మా గౌడ్, ప్రవీణ్ గౌడ్, పశుపతి, రవితేజ గౌడ్, బడి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రంలో పలు కారణాలతో కుటుంబసభ్యులను కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటానని ఆయన భరోసా కల్పించారు.
నైపుణ్యాలను
మెరుగుపర్చుకోవాలి
బాన్సువాడ రూరల్: విద్యార్థులు, యువకులు నైపుణ్యాలను మెరుగపర్చుకోవాలని ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గంగాధర్ సూచించారు. మంగళవారం కొత్తాబాదిలోని తెలంగాణ మాడల్‌స్కూల్‌లో సేవాసంఘం ఫ్రెండ్స్‌యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేరా యువ భారత్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. జూలై 15న ప్రపంచ యుజన నైపుణ్యాల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. డాక్టర్ విఠల్, వినయ్‌కుమార్, సామాజిక కార్యకర్త నరేష్ రాథోడ్, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బీసీ మహాధర్నాకు తరలిన బీఆర్‌ఎస్ శ్రేణులు
సాక్షి నెట్‌వర్క్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద జరిగిన మహాధర్నాకు జిల్లా నుంచి ఆ పార్టీ నాయకులు ప్రత్యేక వాహనాలలో తరలివెళ్లారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాలని ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు.

బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయండి

బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయండి