
చెట్లే మానవాళికి జీవనాధారం
నస్రుల్లాబాద్/బాన్సువాడరూరల్: చెట్లే మానవాళికి జీవనాధారమని, వాటిని నాటడమే కాకుండా సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం దుర్కిలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీకళాశాల, నర్సింగ్ కళాశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రకృతిని కాపాడుకోవాలని, ప్రకృతిని నాశనం చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు. గతంలో నాటిని ప్రతి మొక్క ఇప్పుడు చెట్టుగా మారి కళాశాల ప్రాంగణం అడవిని తలపిస్తుందన్నారు.
ప్రతి జీవి మనుగడ మొక్కలపైనే: సబ్ కలెక్టర్
ప్రతి జీవి మనుగడ మొక్కలపైనే ఆధారపడి ఉందని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఏఎంసీ చైర్మన్ శ్యామల, ప్రిన్సిపాల్ గంగారాం, నాయకులు పెర్క శ్రీనివాస్, వెంకన్న, కృష్ణారెడ్డి, ఎజాస్, పెర్కశ్రీనివాస్, శ్యామల, విఠల్, కంది మల్లేష్, ప్రతాప్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి