
ఉపాధ్యాయులుగా మారిన వైద్య సిబ్బంది
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్‌పేట హైస్కూల్‌లో పీహెచ్‌సీ వైద్య సిబ్బంది ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు పాఠాలను బోధించారు. పాఠశాలలోని జీవశాస్త్ర ఉపాధ్యాయులు రాజు, సతీష్ విజ్ఞప్తిమేరకు నాగిరెడ్డిపేట పీహెచ్‌సీ డాక్టర్ సృజన్‌తోపాటు ఇతర వైద్య సిబ్బంది విద్యార్థులకు రక్తం గ్రూపులు, వాటి వర్గీకరణ, వ్యాధులు, వ్యాధి నిరోధక టీకాలు తదితర అంశాలను వివరించారు. వ్యాధి నిర్ధారణ పరికరాల సహాయంతో ప్రయోగపూర్వకంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాల హెచ్‌ఎం వెంకట్రాంరెడ్డి, వైద్యసిబ్బంది హరిసింగ్, సునంద, మణెమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు
సైన్స్ పాఠాల బోధన