
మద్నూర్ ఎంఈవోపై చర్యలు తీసుకోవాలి
మద్నూర్(జుక్కల్): మద్నూర్ ఎంఈవో రాములు ఏకపక్ష నిర్ణయాలతో గందరగోళం సృష్టిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తపస్ నాయకులు శుక్రవారం ఎంఈవో కార్యాలయంలో ఎంఐఎస్ కో–ఆర్డినేటర్ రవికాంత్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా నాయకులు మాట్లాడుతూ.. ఎంఈవో రాములు టీచర్ల సర్దుబాటు ప్రక్రియ సంఖ్యను ప్రామాణికంగా పాటించకుండా లిస్టులు తయారు చేశారని ఆరోపించారు.
మరాఠీ మీడియంకు చెందిన టీచర్‌ను తెలుగు మీడియం గర్ల్స్ ప్రైమరీకి కేటాయించారని, సంఖ్య ఎక్కువగా ఉన్న చోట ఎక్కువ మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నా వారిని సర్దుబాటు చేయలేదని ఆరోపించారు. సర్దుబాటు ప్రక్రియలో న్యాయం పాటించాలని వినతి పత్రం అందించామన్నారు. త్వరలో పైఅధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. తపస్ నాయకులు రచ్చ శివకాంత్, గోజే సంజీవ్, పండరీనాథ్, అజిత్ పవార్ తదితరులున్నారు.