
డీఎల్పీవో ఎవరో... సెక్రెటరీలు ఎక్కడో..
బాన్సువాడ డీఎల్పీవో ఎవరో కూడా తెలి యని పరిస్థితి ఉందని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. పంచా యతీ కార్యదర్శులు ఏ ఒక్కరూ స్థానికంగా ఉండడం లేదన్నారు. ఉదయం 6 గంటలకు గ్రామాల్లో తిరిగితే సమస్యలు కనబడతాయని, ఎప్పుడో 11 గంటలకు వస్తే ఏం తెలుస్తుందని పేర్కొన్నారు. డీఎల్‌పీ వోనే పనిచేయకపోతే కార్యదర్శులు ఎక్కడ పనిచేస్తారని ప్రశ్నించా రు. అధికారులు హెడ్ క్వార్టర్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నవారికి బిల్లులు త్వరగా వచ్చేలా చూడాలన్నారు.