
పురుగుల నుంచి విముక్తి కల్పించండి
కామారెడ్డి టౌన్: సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో గోదాం నుంచి గ్రామంలోకి లక్క పురుగులు విపరీతంగా వస్తున్నాయని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. ప్రజావాణిలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలో పురుగులు అన్నం తినే సమయంలో అన్నం ప్లేట్‌లలో పడుతున్నాయని, చిన్నపిల్లలపై లక్క పురుగులు వాలి గాయాలు చేస్తున్నాయని, దీంతో ఆస్పత్రుల పాలవుతున్నారని వాపోయారు. అధికారులు విచారణ చేపట్టి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.