
ప్రజాపాలనకు మద్దతుగా కాంగ్రెస్‌లోకి రండి
భిక్కనూరు: ప్రజాపాలనకు మద్దతుగా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. సోమవారం తిప్పాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు అనుచరులతో కలిసి కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బీంరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికి షబ్బీర్‌అలీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. ప్రజాపాలనతో ఇందిరమ్మ రాజ్యం సాధ్యమవుతుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. రైతు భరోసా పథకం డబ్బులను రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్ది ప్రభుత్వానిదేనన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, కిసాన్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కుంట లింగారెడ్డి, మాజీ ఎంపీపీ గాలిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇసుక కొరత రాకుండా చూడాలి
దోమకొండ: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ సూచించారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన పార్టీ నాయకులు ఆయనను కలిసి ఇందిరమ్మ ఇళ్ల ఇసుక కొరతపై వివరించారు. ఇసుక అనుమతులు ఇవ్వడం లేదని, నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయని వారు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన వెంటనే ఎంపీడీవో ప్రవీణ్ కుమార్‌తో పాటు తహసీల్దార్ సుధాకర్‌కు ఫోన్‌చేసి మాట్లాడారు. ఇసుక కొరత రాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్ ఐరేని నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమలగౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు, సొసైటీ చైర్మన్ నాగరాజు రెడ్డి, మాజీ సర్పంచ్ నల్లపు శ్రీనివాస్ ఉన్నారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ