
● ఎస్ 12 పులి కోసం కొనసాగుతున్న గాలింపు ● అడవిలో ఆరు ట
పులి పాదముద్రలను పరిశీలిస్తున్న అటవీ అధికారులు, సిబ్బంది
ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో సంచరిస్తున్న పులి జాడ కనుక్కోవడం కోసం అటవీ అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు. రెండు రోజులైనా పులి ఎక్కడుంది, ఎటు వెళ్లిందన్నదానిపై స్పష్టత లేదు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉమ్మడి జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి కోసం అటవీ శాఖ ఆపరేషన్ కొనసాగుతోంది. జిల్లా అటవీ అధికారి నిఖిత ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి, సిరికొండ, ఇందల్వాయి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట రేంజ్‌లకు చెందిన అటవీ అధికారులు, సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. మూడు బృందాలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రామారెడ్డి, మాచారెడ్డి మండలాల పరిధిలోని రెడ్డిపేట, అన్నారం, ఎల్లంపేట, సిరికొండ మండలంలోని కొండాపూర్, తూంపలి తదితర గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతాలలో గాలిస్తున్నారు.
రాత్రింబవళ్లు రెస్క్యూ ఆపరేషన్...
ఎస్ 12 నంబరుతో పిలవబడే పులి ఇటీవల జిల్లా సరిహద్దుల్లోని సిరికొండ, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో తిరిగినట్టు అటవీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. పులి కదలికలను తెలు సుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తు న్నారు. దాని జాడ కనిపెట్టేందుకు మాచా రెడ్డి, ఇందల్వాయి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, నా గిరెడ్డిపేట, సిరికొండ రేంజీలకు చెందిన అటవీ అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. పులి కదలికలను గుర్తించే క్రమంలో అడవిని జల్లెడ పడుతున్నారు. సోమవారం జిల్లా అటవీ అధికారి నిఖిత కూడా అటవీ ప్రాంతానికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్‌ను పరిశీలించారు. డ్రోన్ కెమెరా ల ద్వారా పులి కదలికలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ట్రాక్ కెమెరాల సాయంతో..
పులి కదలికలను కనిపెట్టేందుకు అటవీ ప్రాంతంలో ఆరు ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులి తిరిగిన ప్రదేశానికి రెండు కిలోమీటర్ల రేడియస్‌లో అన్నివైపులా కవరయ్యేలా కెమెరా లు బిగించినట్టు సమాచారం. ఆ ప్రాంతంలో పులి ఉంటే కచ్చితంగా కెమెరాలు ట్రాక్ చే స్తాయని అధికారులు చెబుతున్నారు. అలాగే రెండు డ్రోన్ కెమెరాలతో అడవిలో తిరుగుతూ పులి జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం ఉద యం నుంచి అర్ధరాత్రి దాటే దాకా గాలింపు కొనసాగింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు సిబ్బంది అటవీ ప్రాంతంలోనే ఉండి పులి జాడ కోసం ప్రయత్నించారు.
అదుపులో ముగ్గురు!
రెడ్డిపేట స్కూల్ తండా పరిధిలోని అటవీ ప్రాంతంలో ఇటీవల ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. అయితే ఆవు యజమానితో పాటు మరో ముగ్గురు ఆవుపై పురుగుమందులు చల్లి పులిని మట్టుబెట్టే ప్రయత్నం చేశారని అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. విష ప్రయోగం నిర్ధారణ కోసం శాంపిళ్లను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.
నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు ఇందల్వాయి, నిజామాబాద్ సౌత్ రేంజ్‌లలోనూ అప్రమత్తం
డొంకేశ్వర్(ఆర్మూర్) : మాచారెడ్డి రేంజ్ పరిధిలో ఆవుపై దాడిచేసి చంపిన పెద్దపులి మొదటగా నిజామాబాద్ జిల్లా సిరికొండ రేంజ్‌కే వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే తాటిపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి పాద ముద్రలను గుర్తించిన విషయం తెలిసిందే. తాటిపల్లి అటవీలోనే కొన్ని రోజులు పెద్దపులి సంచరించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కొండలు, రాళ్ల గుట్టలు ఎక్కువగా ఉండడంతో మాచారెడ్డి అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు భావిస్తున్నారు. అయితే మాచారెడ్డి రేంజ్‌లో పెద్దపులిపై విష ప్రయోగం జరిగిందన్న వార్తలు రావడం, పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో నిజామాబాద్ జిల్లాలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. పెద్ద పులి మళ్లీ నిజామాబాద్ జిల్లా వైపు రావొచ్చనే సందేహంతో సిరికొండ, ఇందల్వాయి, నిజామాబాద్ సౌత్ రేంజ్‌లను అప్రమత్తం చేశారు. బీట్ ఆఫీసర్లను టీములుగా విభజించి గస్తీ తిరుగుతున్నారు. అటవీ పరిసర గ్రామాల ప్రజలకు, రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
పెద్దపులి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, ఉచ్చులు, విద్యుత్ తీగలు పెట్టకూదని అధికారులు సూచిస్తున్నారు. అదే విధంగా నిజామాబాద్ నాగారంలో చిరుత సంచారం నేపథ్యంలో అన్ని రేంజ్‌లలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలిచ్చారు.
రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు
వర్షాకాలం కావడంతో అడవి పచ్చబడింది. ముళ్ల పొదలు, చెట్లు పెరిగి అడవిలో తిరగడానికి అటవీ అధికారులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. పులిని గుర్తించడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఎస్ 12 పులిని కాపాడేందుకు ప్రత్యేక బృందాలు అడవుల్లో తిరుగుతూ దాని కదలికలను పసిగట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. పులి ఏ వైపు వెళ్లింది అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. నాలుగైదు దశాబ్దాలుగా జిల్లాలో పులుల సంచారం లేదు. ఇప్పుడు వచ్చిన పులిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ప్రజలు అటవీ ప్రాంతానికి వెళ్లొద్దు. పులిపై విష ప్రయోగం జరిగిందా లేదా అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చాకే చెప్పగలం.
– నిఖిత, డీఎఫ్‌వో, కామారెడ్డి

● ఎస్ 12 పులి కోసం కొనసాగుతున్న గాలింపు ● అడవిలో ఆరు ట

● ఎస్ 12 పులి కోసం కొనసాగుతున్న గాలింపు ● అడవిలో ఆరు ట