
విద్యార్థినులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి
ఎల్లారెడ్డి: విద్యార్థినులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఆదివారం ఆయన సందర్శించారు. పాఠశాలలోని వంట గదులు, తరగతి గదులు, సామగ్రిని పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థినులు తమ సమస్యలను తెలియజేయాలని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అలాగే కేజీబీవీలో రూ.3.5 కోట్ల నిధులతో చేపట్టిన నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మినీ ట్యాంక్‌బండ్ పనులను పరిశీలించి, పనులు వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. ఏఎంసీ చైర్‌పర్సన్ రజిత, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్లు శ్రీకాంత్, సత్యనారాయణ, నాయకులు సాయిబాబా, వినోద్‌గౌడ్, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, సామెల్, విద్యాసాగర్, అరుణ, వాసవి, వెంకటేశం, ఇరిగేషన్ డీఈ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ ప్రమీల, స్పెషల్ ఆఫీసర్ వీణ తదితరులు ఉన్నారు.