
కిసాన్‌నగర్‌లో విజృంభించిన డెంగీ
20 మందికి పాజిటివ్ ● గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు
మాచారెడ్డి: పాల్వంచ మండలం భవానీపేట గ్రామపంచాయతీ పరిధిలోని కిసాన్‌నగర్‌లో డెంగీ విజృంభిస్తోంది. గ్రామంలో ఇంటికొకరు చొప్పున జ్వరంతో మంచం పట్టారు. వారం రోజుల నుంచి జ్వరాలతో బాధపడుతున్నారు. పలువురికి డెంగీ పాజిటివ్ రావడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి చికిత్సలు పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ వైద్య సిబ్బంది శనివారం కిసాన్‌నగర్‌లో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలో చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా జ్వరాలతో బాధపడుతున్నారని మండల వైద్యాధికారి ఆదర్శ్ తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైనవారికి మందులు పంపిణీ చేస్తున్నామని, డెంగీ బాధితులను కామారెడ్డిలోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామంలో దోమల నివారణ చర్యలు చేపట్టామన్నారు. ఈ శిబిరంలో ఏఎన్‌ఎం సుమలత పాల్గొన్నారు.
ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది

కిసాన్‌నగర్‌లో విజృంభించిన డెంగీ