
కార్మికులు కలిసి కట్టుగా పోరాటం చేయాలి
సాక్షి నెట్‌వర్క్:జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె విజయవంతమైంది. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక అధికారులకు వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కార్మికులు కలిసికట్టుగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. నాలుగు లేబర్ కోడ్ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఎనిమిది గంటల పని దినాలను అమలు చేయాలన్నారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

కార్మికులు కలిసి కట్టుగా పోరాటం చేయాలి

కార్మికులు కలిసి కట్టుగా పోరాటం చేయాలి