పాఠశాల పునఃప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పాఠశాల పునఃప్రారంభం

Jul 10 2025 6:26 AM | Updated on Jul 10 2025 6:26 AM

పాఠశా

పాఠశాల పునఃప్రారంభం

సదాశివనగర్‌: దగ్గి గ్రామంలో మూతపడ్డ ప్రాథమిక పాఠశాలను బుధవారం డీఈవో రాజు పునఃప్రారంభించారు. గతంలో విద్యార్థులు లేకపోవడంతో ఈ పాఠశాలను మూసివేశారు. స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్‌రెడ్డి గ్రామస్తులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలను వివరించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు. దీంతో ఈ ఏడాది పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బుధవారం పాఠశాలను పునఃప్రారంభించారు. కార్యక్రమంలో సీఆర్పీ నందురావు, ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కొత్త సబ్‌స్టేషన్లతో మరింత నాణ్యమైన విద్యుత్‌ సరఫరా

కామారెడ్డి అర్బన్‌: కొత్త సబ్‌స్టేషన్లతో మరింత నాణ్యమైన విద్యుత్‌ అందుతుందని ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు. వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడానికి కామారెడ్డి సర్కిల్‌ పరిధిలో నాలుగు సబ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చిట్యాల, మహ్మద్‌నగర్‌ సబ్‌స్టేషన్ల పనులు ముమ్మరంగా కొనసాగుతుండగా, బోర్గాం, కామారెడ్డి ఇండోర్‌ సబ్‌ స్టేషన్లకు టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. కొత్త సబ్‌స్టేషన్లలో స్కాడా అనుసంధానం వంటి ఆధునిక సాంకేతికను వినియోగిస్తున్నామని వివరించారు. దీని ద్వారా రియల్‌ టైం ఫీడర్‌ మానిటర్‌ చేయగలమని పేర్కొన్నారు.

బోనాల పండుగకు

ఆహ్వానం

దోమకొండ: మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు బుధవారం జిల్లాకేంద్రానికి వెళ్లి ఎస్పీ రాజేశ్‌ చంద్ర, ఏఎస్పీ చైతన్యరెడ్డిలను కలిశారు. ఆదివారం నిర్వహించే బోనాల పండుగకు హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రికలను అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి, అర్చకుడు శరత్‌ చంద్ర, బీజేపీ మండల అధ్యక్షుడు మద్దూరి భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ

మాచారెడ్డి: మాచారెడ్డి పోలీస్‌ స్టేషన్‌ను బుధవారం కామారెడ్డి అసిస్టెంట్‌ ఎస్పీ చైతన్యరెడ్డి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పోలీస్‌ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట కామారెడ్డి రూరల్‌ సీఐ రామన్‌, ఎస్సై అనిల్‌ ఉన్నారు. పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసి పదోన్నతిపై వెళ్తున్న కానిస్టేబుళ్లు రామారావు, స్వామిలను ఎస్సై అనిల్‌ సన్మానించారు.

పాఠశాల పునఃప్రారంభం
1
1/2

పాఠశాల పునఃప్రారంభం

పాఠశాల పునఃప్రారంభం
2
2/2

పాఠశాల పునఃప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement