
ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం
కామారెడ్డి టౌన్: ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవా న్ని బుధవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు విద్యార్థులతో కలిసి పట్టణంలో ర్యాలీ తీశారు. కొత్త బస్టాండ్ వద్ద పరిషత్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రోహిత్, నాయకులు నరేష్, స్వామి, వెంకటస్వామి, రాహుల్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో ఏబీవీపీ ఆవిర్భా వ వేడుకలను జరిపారు. అంబేడ్కర్ చౌరస్తా ప్రాంతంలో భరతమాత చిత్రపటానికి పూల మాలలు వేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ కృషి చేస్తోందన్నారు. నేతలు మహేష్, వినోద్, తులసి, దేవేందర్, రాజేష్, కాశి పాల్గొన్నారు.