
బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యాలను పూర్తి చేయాలి
కామారెడ్డి అర్బన్: మహిళా సంఘాలకు సంబంధించిన బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం కామారెడ్డిలో నిర్వహించిన మండల ఇందిర మహిళా శక్తి ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హతగల మహిళలందరిని మహిళా సంఘాల్లో సభ్యులుగా చేర్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ చందర్, డీఆర్‌డీవో సురేందర్, డీఏవో తిరుమల ప్రసాద్, డీపీఏం(ఫైన్సాన్స్) రాజయ్య, ఎంపీడీవో ఎఫ్సిబా, ఏపీఎం మోహిజ్, సీసీలు విశ్వనాథం, అంజగౌడ్, స్వరూప, సంజీవులు తదితరులు పాల్గొన్నారు.