
మొక్కలు నాటి సంరక్షించాలి
దోమకొండ: మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శంకర్ అన్నారు. సోమవారం కళాశాల ఆవరణలో ప్లాంటేషన్ డే కార్యక్రమం నిర్వహించి మొక్కలను నాటారు. ఎంపీడీవో ప్రవీన్‌కుమార్, ఏపీవో రజని, పంచాయితీ కార్యదర్శి యాదగిరిగౌడ్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
అమ్మ పేరు మీద ఒక మొక్క
బీబీపేట: వన మహోత్సవంలో భాగంగా సోమవారం ఉప్పర్‌పల్లిలో ఎంపీడీవో పూర్ణచంద్రోదయ కుమార్ చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాటుదాం ఒక మొక్క అమ్మ పేరు మీద అనే పేరుతో ప్రభుత్వం మొక్కలు నాటాలని పిలుపునిచ్చిందని.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పేర్కొన్నారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో నాటిన మొక్కలను సోమవారం ఎంపీడీవో సంతోష్‌కుమార్ పరిశీలించారు. ఎంపీవో సురేందర్ రెడ్డి, పంచాయితీ కార్యదర్శి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): అచ్చాయపల్లిలో సోమవా రం వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామశివారులోని చెరువుకట్టపై ఎకై ్సజ్‌శాఖ ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటారు. పంచాయతీ కార్యదర్శి వెంకటరాజు, ఎకై ్సజ్ అధికారులు స్రవంతి, లావణ్య, రజిత, రవి, సంజీవ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
వనమహోత్సవాన్ని
విజయవంతం చేయాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో సయ్యద్ సాజీద్‌అలీ అన్నారు. తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఫీల్డు అసిస్టెంటులు, గ్రామ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మండలంలో 60 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా ఉందన్నారు. రెండు రోజుల్లో లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేయాలని సూచించారు. నర్సరీలలో అన్ని రకాల మొక్కలు అందుబాటులో ఉంచాలన్నారు. ఎంపీవో సవిత, ఏపీవో కృష్ణగౌడ్, తదితరులుపాల్గొన్నారు.