
అమ్మాబాపు.. ఎట్లున్నరే..
ఎల్లారెడ్డి: హలో.. అమ్మాబాపు ఎట్లున్నరే.. అంటూ గురుకుల విద్యార్థులు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఫోన్‌లో మాట్లాడారు. ‘ఫోన్ మిత్ర‘ కార్యక్రమంలో భాగంగా గురుకుల విద్యార్థులకు ఫో న్ సౌకర్యం శనివారం నుంచి అందుబాటు లోకి వచ్చింది. హాస్టల్ విద్యార్థుల కోసం వి ద్యాశాఖ ‘ఫోన్ మిత్ర’ కార్యక్రమానికి శ్రీకా రం చుట్టింది. నలుగురు హాస్టల్ విద్యార్థులకు కలిపి ఒక స్మార్ట్ కార్డు ఇచ్చి వారి తల్లిదండ్రుల, సంరక్షకుల నంబర్లు ఫీడ్ చేశారు. ఈ కార్డు ద్వారా విద్యార్థి తమ కుటుంబసభ్యులతో ప్రతి రోజు 25 నిమిషాలపాటు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఫోన్‌లో 5 నంబర్ డయల్ చేస్తే గురుకుల సొసైటీ కార్యదర్శికి వెళ్తుంది. హాస్టళ్లు, పాఠశాలల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు ఫోన్‌లో వివరించవచ్చు. ఎల్లారెడ్డి గురుకులంలో 8 ఫోన్లను వేసవి సెలవులల్లో ఏర్పాటు చేసినా శనివారం వాటికి కనెక్షన్ ఇచ్చారు.
‘ఫోన్ మిత్ర’కు అపూర్వ స్పందన
గురుకుల పాఠశాలల్లో ప్రారంభం