
పట్టు సాగుకు ముందుకు రావాలి
బీబీపేట: పట్టు పరిశ్రమ ఏర్పాటుకు రైతులు ముందుకు రావాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల అధికారి జ్యోతి సూచించారు. సోమవారం యాడారంలో మల్బరీ మొక్కల మెగా వనమహోత్సవం నిర్వహించారు. గ్రామానికి చెందిన నవీన్‌రావు పది ఎకరాల్లో మల్బరీ సాగుకు ముందుకు రావడంతో ఆయన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 120 ఎకరాలలో మల్బరీ సాగును ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఉద్యాన అధికారి సంతోషిరాణి, సెరికల్చర్ అధికారి అయిలయ్య, అసిస్టెంట్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.